సరస్సు ఒడ్డున మరో పడవ కట్టేసి ఉంది . ఇద్దరు ఇండియన్లు ఎదురు చూస్తున్నారు నిక్ వాళ్ళ నాన్న పడవ ఎక్కేరు ఇండియన్లు దాన్ని తోసేరు . అందులో ఒకడు తెడ్డు దగ్గర నిల్చున్నాడు . ఒక చిన్న ఇండియన్ క్యాంపు
నీటిమీద పడవనితోసి ఆందులో జార్జ్ ని తీసుకువెళ్లి తెడ్డు వేసేడు .
ఆరెండు పడవలు చీకట్లో బయలు దేరేయి వాళ్ళకి ముందు ఉన్న రెందో పడవ
చప్పుడు పొగ మంచులో నిక్ విన్నాడు ఇండియన్లు వేగంగా తెడ్లు వేస్తున్నారు .నీక్క్ తన తండ్రి చెయ్యి తన చేతిలోకి తీసుకోని వెనక్కి వాలాడు .నీటిమీద చాలా చల్లగా ఉంది .వాళ్ళని తీసుకువెళుతున్న పడవ నడిపేవాళ్లు చాలా కష్టపడుతున్నారు .కానీ ఆ రెండో పడవ వాళ్లకన్నా చాలా ముందు ఉంది
” మనం ఎక్కడికి వెళుతున్నాం డాడ్ ” అడిగేడు నిక్
“” ఇండియన్ క్యాంపుకి అక్కడ ఒక ఇండియన్ ఆవిడకిక్ చాలా జబ్బుగా ఉంది “
– అలాగా ” ఒడ్డు దగ్గర రెండవ పడవ ఆగి ఉంది ఆ చీకటిలా అంకుల్ జార్జ్ సిగరెట్ కాలుస్తున్నాడు
ఆ చిన్న ఇండియన్ పడవని బీచ్ ఒడ్డుకి లాగేడు అంకుల్ జార్జ్ ఆ ముగ్గురు ఇండియన్లకి
సిగరెట్లు ఇచ్చేడు వాళ్ళు బీచ్ నించి మంచుకి తడిసిన గడ్డి మైదానం గుండా నడిచేరు వాళ్ళ ముందు ఒక ఇండియన్ లాంతరు పట్టుకొని నడుస్తున్నాడు అక్కడి నించి కొండల్లోకి వెళ్లే దారి గుండా వెళ్ళేరు ఆ తోవలో రెండు వైపులా చెట్లు కొట్టేయడం వల్ల కొంచెం వెలుతురూ ఉంది
వాళ్ళు ఒక వంపు దగ్గరకి రాగానే ఒక కుక్క మొరుగుతూ వచ్చింది ఎదురుగా ఇండియన్లు ఉండే గుడిసెలు కనిపించేయి చాలా కుక్కలు వాళ్ళ దగ్గరకు వచ్చేయి వాళ్ళు వాటిని గుడిసె దగ్గరకి పంపేరురోడ్డు కి దగ్గరగా ఉన్న గుడిసెలో వెలుతురు ఉంది ఒక ముసలావిడ లాంతరు పట్టుకొని గుమ్మంలో నిలుచుంది
లొపల ఓక బంక్ బెడ్ మీద ఒక స్త్రీ పడుకొని ఉంది ఆవిడ రెండురోజులనుండి ప్రసవ వేదన పడుతోంది – ఆ క్యాంపులో ఉన్న ఆడవాళ్లు ఆవిడకి సాయం చేస్తున్నారు మొగ వాళ్ళు ఆవిడ కేకలు విపడకుండా దూరంగా వెళ్లి సిగరెట్ కాకాచుకుంటున్నారు.
నిక్ వాళ్ళ నాన్న గుడిసెలోకి వెళ్ళినప్పుడు ఆవిడ గట్టిగా అరిచింది . ఆవిడ కింద బంక్ మిద బొంత కింద పడుకొని ఉంది . ఆవిడ తల ఒక ప్రక్కకి తిరిగి ఉంది పైన బుంకెమీద ఆవిడ భర్త పడుకొని ఉన్నాడు . గద చాలా చెడు వాసన వస్తోంది .
నిక్ నాన్న నీళ్లు స్టవ్ మీద పెట్టమని చెప్పి నిక్ తో – యీవిడ ఇప్పుడు బిడ్డని కంటోంది ” అన్నాడు
నాకు తెలుసు ” అన్నాడు నిక్
– నీకు తెలీదు ఇప్పుడు ఆవిడ పడుతున్నదాన్ని ప్రసవవేదన అంటారు బేబీ బయటికి రావాలని అనుకుంటోంది ఆవిడ కండరాలు అన్నీ సహకరిస్యున్నాయి ఆవిడ అరుస్తున్నప్పుడు ఆదే జరుగుతుంది “
– అలాగా ” అన్నాడు నిక్
అప్పుడే ఆవిడ గట్టిగా అరిచింది
– ఓహ్ డాడీ ఆవిడ అరుపులు ఆపడానికి నువ్వు ఏవైనా ఇవ్వలేవా “. అన్నాడు నిక్
-. నా దగ్గర మత్తు ఇచ్చేవి ఏవీ లేవు అయినా ఆ అరుపులు అంత ముఖ్యం కాదు అందుకె నేను వినను “
పై బంక్ మీద ఉన్న భర్త గోడ వేపు తిరిగేడు
వంట ఇంటిలో ఉన్న ఆవిడ నీళ్లు మరిగేయి అని డాక్టరుతో చెప్పింది. అతను వంట ఇంటిలోకి వెళ్లి కెట్లే లో ఉన్న మీరు సగం బేసిన్లో పోసేడు. తన రుమలలో ఉన్న వస్తువులని ఆ కెటిల్ లో వేసేడు
-. అవి మరగాలి ” అని తాను తెచ్చిన సబ్బుతో చేతులు బేసిన్లో. కడుక్కున్నాడు నిక్ తన తండ్రి చేస్తున్నదంతా చూస్తున్నాడు
-. చూడు నిక్ పిల్లలు ముందు తల తో పుట్టుతారు కానీ ఒక్కొక్కసారి ఆలా కాదు ఆలా ఐతే
అందరికి చాల సమస్య అవుతుంది బహుశా నేను ఏవిడకి ఆపరేట్ చెయ్యాలి. కొంచెం సేపట్లో తెలుస్తుంది
అతను తన చేతులు ఓసారి చూసి పని ప్రారంభించేడు
– జార్జ్. ఆ బొంత. తీసెయ్యి. నేను ముట్టుకోకూడదు ” అన్నాడు
ఆతరవాత ఆటను ఆపరేట్ చెయ్యడం ప్రారంభించేడు. అంకుల్ జార్జ్. మరో ముగ్గురు ఇండియన్స్ మొగాళ్ళు ఆవిడని గట్టిగ పట్టుకున్నారు. ఆవిడా అంకుల్ జార్జిని. చేతిమీద కరిచింది ఇడియట్ అన్నాడు జార్జ్. అంకుల్ జార్జిని తీసుకోని వచ్చిన ఇండియన్ ఫక్కున్మని నవ్వేడు నిక్ వాళ్ళ నాన్నకి బేసిన్ పట్టుకున్నాడు అదంతా చాల టైం పట్టింది
డాక్టర్. బాబైని పైకే తీసి గట్టిగ చరిచేడు ఊపిరి తీసుకోడానికి తరవాత ఆ బాబైని ఆ ముసలావిడకి ఇచ్చేడు
-. అబ్బాయి. నిక్. ఇటెర్నీ గ ఎలా ఉంది “. అడిగేడు
-. బాగానే ఉంది. అన్నాడు ఆటను తన తండ్రి చేతున్నది చూడడం ఇష్టం లేక ఎటో చూస్తూ
-. అది ఉంది. “. అంటూ దేన్నో తీసి బేసిన్లో వేసేడు
ఇక్ అటువైపు. చూడలేదు
– ఇప్పుడు నేను కుట్లు. వెయ్యాలి నిక్. నీకు ఇష్టం ఐతే చూడు లేకేపోతే లేదు “
నిక్ చూడలేదు అతని ఉత్సాహం ఎప్పుడో పోయింది.
అతని తండ్రి పూర్తీ చేసి లేచి నిలుచున్నాడు
జార్జ్. మిగిలిన ముగ్గురు. ఇండియన్స్ కూడా లేచి నిలుచున్నారు. నిక్ బేసిన్ వంట గదిలో
పెట్టేడు
జార్జ్ తన చేతిని చూసుకున్నాడు. చిన్న ఇండియన్. భావగర్భితంగా నవ్వేడు
– నేను దానికి పెరాక్సయిడ్ పెడతాను జార్జ్ ” అన్నాడు డాక్టర్
తరవాత ఆ ఇండియన్ ఆవిడా ని చూసేది. కళ్ళు ము ఉంది. తెల్ల గ పాలి పోయి ఉంది
ఆవిడకి. పిల్ల డి సంగతి ఏవి తెలీదు
– నేను పొ ద్దు న్న వస్తా ను. రేపు. మధ్యాహ్నం. ఇగ్నాస్ నుండి నర్స్ వస్తుంది ఆవిడా మాకు కావలసినవి అన్ని తెస్తుంది. ” అన్నాడు డాక్టర్ t
గేమ్ అయిన్ తరవాత డ్రెస్సింగ్ రూంలో. ఫుట్బాల్ ప్లేయర్లు లాగా ఆటను మంచి హుషారుగా ఉన్నాడు
మడత చాకుతో సెసరియన్ చేసి తొమ్మిది అడుగుల సన్నటి పేగుతో కుట్లు వెయ్యడం ఇది
మెడికల్ జర్నల్. కి ఇవ్వాలి జార్జ్ ” అన్నాడు
అంకుల్ జార్జ్ గోడకి చెరబడి తన చెయ్యి చూసుకుంటున్నాడు
ఔను నువ్వు చాల గొప్పవాడివి. అన్నాడు
– ఓసారి ఆ తండ్రిని చూడాలి ఇలాటి విషయాల్లో వాళ్ళు ఎక్కువ బాధ పడతారు ఇతను బావున్నాడని అనుకుంటాను “. అంటూ డాక్టర్ ఆ ఇండియన్ తల మిడి దుప్పటి లాగేడు
అతని చెయ్యి తడిగా తగిలింది. అతను బెడ్ చివర ఎక్కి ఒక చేత్తో లాంతరు పట్టుకొని చూసేడు
ఆ ఇండియన్ తల గోడవైపు ఉంది అతని గొంతు యి చెవి నుంచి ఆ చెవి వరకు తెగి ఉంది
ఆ బెడ్ నిండా రక్తం కారుతోంది దుప్పటి లో రేజర్ పది ఉంది
– నిక్ ని బైటకి తీసుకువెళ్ళు జార్జ్ ” అన్నాడు డాక్టర్
అవసరం లేదు నిక్ వంట ఇంటిలో నించి తన తండ్రి. లాంతరు తో చూడడం చూసేడు
వాళ్ళు తిరిగి సరస్సు వేపు వెళుతున్నప్పుడు. తెల్లవారుతోంది
నేను నిన్ను తీసుకు వచ్చినందుకు బాధ గ ఉంది ” అన్నాడు డాక్టర్
ఆడవాళ్లు. బేబీస్ ని కనడానికి అంత బాధ పడతారా ” అడిగేడు నిక్
లేదు అది చాల అరుదు ”
– అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు డాడ్ ”
– నాకు తెలీదు బహుశా తట్టుకోలేకపోయేదేమో “
-. ఎక్కువమంది మొగాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారా డాడీ “
-. ఎక్కువ మంది కాదు “”
మరి ఆడవాళ్ళూ ”
ఎప్పుడు కాదు
-డాడీ “.
చెప్పు
–అంకుల్ జార్జ్ ఎక్కడికి వెళ్తాడు ”
-. వస్తాడు ”
చావు అంత కష్టమా ”
కాదు చాల సులువు
వాళ్ళు పడవల కూర్చున్నారు డాక్టర్ తెడ్డు వేస్తున్నాడు.
సూర్యుడు కొండల్ మీదనించి వస్తున్నాడు
తన తండ్రి తెడ్డు వేస్తూ ఉంటె పడవల కూర్చున్న. నిక్. నేను ఎప్పుడు చావు కోరుకొను
అనుకున్నాడు.
