కథా యాత్రలో మీరేంటోళ్లు ? కథానిక. నీలకంఠ గారి రచన. “మీరు ఎంతమంది ఉంటారు ఏం పని చేస్తారు పిల్లలు ఏం చదువుతారు వంట వివరాలన్నీ అడిగాడు ఆయన. ఇల్లు చక్కగా ఉంది ఖాళీ స్థలంలో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. నాకు బాగా నచ్చింది. బాడుగ చెప్పారు. అడ్వాన్స్ అవసరం లేదు అన్నారు. ఎలాంటి షరతులు లేవు. ఇక నేను ఎదురు చూసే ప్రశ్న మీరు ఏంటోళ్లు? అనే ప్రశ్న- ఆయన అడగలేదు, అడగటం లేదు కూడా. కానీ నా మనసులో ఏదో బెరుకు. ఆయన అడిగిన తర్వాత చెప్పి’ ఇల్లు లేదు’ అని అనిపించుకోవడం కంటే ముందే మనమే చెప్పేద్దాం అనుకున్నాడు.
ఈ కథ తెలుగు భాషా ఉద్యమ సమితి తిరుపతి వారు నిర్వహించిన ఉగాది కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ