మనోజ్ కుమార్ శర్మ, గ్రామీణ పేదరికం లో పుట్టి, అన్ని రకాల కష్టాలు పడి చివరికి IPS అఫిసర్ గా(121ర్యాంక్ ) సెలెక్ట్ అయిన ఓ నిజమైన హీరో కథ. మొదట ఈ రియల్ స్టోరీ ని అనురాగ్ పాఠక్ అనే రచయిత పుస్తకం గా రాసారు. ఇప్పుడు అదే పేరు మీద సినిమా రూపం లో వచ్చింది. మనోజ్ అందరిలాగానే మస్ కాపియింగ్ చేసేవాడు. కానీ ఈసారి పోలీస్ ఆఫీసర్ వల్ల కాపీయింగ్ ఆగిపోయింది. అందరూ ఫెయిల్ అయ్యారు. ఈ మంచి పోలీస్ ఆఫీసర్ నిజాయితీ గా ఉంటేనే నిజమైన విజయాలు వస్తాయని అన్న మాటలు తన్ని ఇన్సపైర్ చేస్తాయి. పట్టుదలతో 12th, డిగ్రీ పూర్తిచేసి, స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాద్దామని దగ్గరలో వున్న పట్నం బయలుదేరతాడు. అన్ని రకాల మోసాలకు గురయ్యి చివరికి ఓ మిత్రుని సహాయం తో ఢిల్లీ చేరతాడు. IAS కోచింగ్ మాయాజాలాల మధ్య తిరుగుతూ పొట్ట నింపుకోవడానికి అనేక చిన్న పనులు చేస్తూ, హీరోయిన్ శ్రద్ధ, మరికొంత మంది మిత్రుల సహాయం తో చివరకు IPS సాధించడమే సినిమా.
డైరెక్టర్ విందు వినోద్ చోప్రా సినిమాను చక్కని దృశ్యం కావ్యంగా మలిచారు. హీరోగా విక్రాంత్ మాస్సి, హీరోయిన్ గా మధు సర్కార్ చక్కగా నటించారు. సంగీతం, ఫోటోగ్రఫీ పర్ఫెక్ట్ గా వున్నాయి. ఈ మధ్యతరగతి బడ్జెక్ట్ సినిమా మంచి హిట్ అయ్యింది. 20 కోట్లు ఖర్చు పెడితే 50 కోట్ల వసూళ్లు చేసింది. సినిమా మంచిగా తీయగలిగితే, డబ్బులు కూడా వస్తాయన్న దానికి ఈ సినిమా నే రుజువు.
Ott లో డిస్నీ హాట్ స్టార్ట్ లో వుంది. తెలుగు డబ్బింగ్ కూడా వుంది