అప్పట్లో ఒక మనిషి ఉండేవాడు. అతను తన జీవించిన 71 సంవత్సరాలు పాపాలు చేస్తూనే బతికాడు. తర్వాత అతను జబ్బు పడ్డాడు. అప్పటికి కూడా తన పాపాల పట్ల అతను పశ్చాత్తాప పడలేదు. చనిపోయే చివరి క్షణంలో మాత్రం “ నీవు సిలువలో ఉన్నప్పటికీ దొంగని క్షమించినట్లు నన్ను కూడా క్షమించు” ప్రభువా అని ఏడ్చాడు.
అతను ఆ మాటలు చెప్పిన తర్వాత అతని ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళింది. అతని ఆత్మ దేవుని పట్ల ప్రేమతో, నమ్మకంతో స్వర్గపు ద్వారాలు వద్దకు వెళ్లి తలుపులు తట్టి స్వర్గపు రాజ్యంలోకి అనుమతించమని ప్రార్థించింది.
అప్పుడు ఆ ద్వారం లోపలి నుండి ఒక స్వరం ఇలా మాట్లాడింది “ఎవరు స్వర్గపు తలుపులను కొట్టింది, అతను తన జీవితం మొత్తంలో ఎలాంటి పనులు చేశాడు” అని.
అప్పుడు ఆ పాపి అతను చేసిన చెడ్డ పనులు గురించి చెప్పాడు. అందులో ఒకటి కూడా మంచి పని లేదు.
“పాపులు స్వర్గపు రాజ్యంలోకి రావడానికి అనుమతి లేదు అందుకే వెళ్ళిపో” అని ఆ స్వరం సమాధానం ఇచ్చింది.
“ప్రభువా, నేను మీ స్వరం విన్నాను. కానీ మీ ముఖం చూడలేదు. పేరు కూడా తెలియదు” అని ఆ పాపి అన్నాడు.
“నేను ప్రభువు యొక్క ముఖ్య శిష్యుడైన పీటర్ ను” అని ఆ స్వరం చెప్పింది.
అప్పుడు పాపి ఇలా అన్నాడు”ముఖ్య శిష్యుడు అయిన పీటర్ గారు, నా మీద జాలి చూపించండి. ఒకసారి మనిషి యొక్క బలహీనతల గురించి దేవుడు యొక్క దయ గురించి గుర్తు చేసుకోండి. మీరు కూడా క్రీస్తు యొక్క శిష్యుడే కదా! అతని బోధనలను అతని పెదవుల నుండి విన్నవారే కదా. ఆ ఉదాహరణే మీ ముందు ఉంది. ప్రభువు ఆత్మ నందు దుఃఖిస్తూ మిమ్మల్ని మెలకువగా ఉండి ప్రార్థన చేయమని మూడుసార్లు చెప్పినప్పటికీ మీరు నిద్రపోయారు కదా! ఎందుకంటే అప్పుడు మీ కళ్ళు బరువెక్కాయ్. మీరు నిద్రపోతున్నట్లు మూడుసార్లు ప్రభువు గమనించారు. మీకు గుర్తుందా… మరణం వరకు అతనితో ఉంటానని ప్రమాణం చేసినప్పటికీ కైఫన్స్ వద్దకు మిమ్మల్ని తీసుకు వెళ్లినప్పుడు మూడుసార్లు తిరస్కరించలేదా? కోడి కూసినప్పుడు బయటకు వెళ్లి ఎంతగా ఏడ్చారో మీకు గుర్తుందా. ఇవన్నీ నాకు తెలుసు అందుకే మీరు నన్ను లోపలకి రావడాన్ని తిరస్కరించలేరు.
అప్పుడు ఆ ద్వారం లోపల స్వరం మూగిపోయింది.
ఆ పాపి కాసేపు అలానే నిలబడి స్వర్గపు రాజ్యంలోకి అనుమతి ఇవ్వాలని మళ్లీ తలుపులు తట్టడం ప్రారంభించాడు. అప్పుడు మళ్ళీ లోపల నుండి ఇంకొక స్వరం ఇలా అడిగింది “ఎవరో ఆ వ్యక్తి? అతను భూమి మీద ఎలా జీవించాడు” అని.
అప్పుడు పాపి మళ్లీ తను చేసిన అన్ని చెడ్డ పనుల గురించి చెప్పాడు. అందులో ఒకటి కూడా మంచి పని లేదు.
అప్పుడు ఆ స్వరం ఇలా అనింది “ వెళ్ళిపో ఇలాంటి పాపులు స్వర్గంలో మాతోపాటు జీవించడానికి వీల్లేదు” అని.
అప్పుడు ఆ పాపి ‘ప్రభువా, నేను స్వరం మాత్రమే విన్నాను. మీ ముఖము చూడలేదు పేరు కూడా తెలియదు’, అని అన్నాడు.
అప్పుడు ఆ స్వరం ‘నేను డేవిడ్, రాజును మరియు ప్రవక్తను’ అని సమాధానం ఇచ్చింది.
అప్పుడు ఆ పాపి నిరాశ చెందలేదు, స్వర్గపు ద్వారాలను విడిచి వెళ్ళలేదు.
పాపి ఇలా అన్నాడు “డేవిడ్ రాజా, నా మీద జాలి చూపించు. మనిషి యొక్క బలహీనతలను దేవుడు యొక్క దయను గుర్తు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు రాజ్యము, గౌరవం, సంపదలు, భార్యలు పిల్లలు అన్నిటినీ ఇచ్చారు. కానీ మీరు మీ ఇంటి మీద నుండి ఒరియా అనే పేద వ్యక్తి భార్యని చూసి అతన్ని అమ్మోనీయుల కత్తితో చంపారు. అలా పాపం మీలోకి ప్రవేశించింది. మీరు ధనవంతులైనప్పటికీ ఆ పేద ఆడ గొర్రె పిల్లని తీసుకొని, అతన్ని కూడా చంపారు. నేను కూడా అలానే చేశాను. గుర్తుందా మీ పాపాలకు మీరు పశ్చాత్తాప పడి “ నా పాపాలను నేను అంగీకరిస్తున్నాను”అని ఎలా అయితే చెప్పారో నేను అలానే చేశాను. అందుకే మీరు నన్ను లోపలికి రానీకుండా ఆపలేరు”.
అలా ఆస్వరం కూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది.
అప్పుడు ఆ పాపి కాసేపు అలానే నిలబడి స్వర్గపు రాజ్యంలోనికి రానివ్వాలని మళ్లీ తలుపులు తట్టడం ప్రారంభించాడు.
అప్పుడు మూడో స్వరం ఆ ద్వారం నుండి ఇలా మాట్లాడింది ‘ఎవరో ఆ వ్యక్తి? అతని తన జీవితాన్ని భూమ్మీద ఎలా గడిపాడు’ అని.
అప్పుడు ఆ పాపి మూడోసారి కూడా తను చేసిన చెడ్డ పనులు అన్నిటి గురించి చెప్పాడు. వాటిలో ఒకటి కూడా మంచి పని లేదు.
ఆ స్వరం వెంటనే ఇలా అనింది ‘ఇక్కడినుండి వెళ్ళిపో, పాపులు స్వర్గపు రాజ్యంలోకి రావడానికి వీల్లేదు’ అని.
అప్పుడు ఆ పాపి, ‘ నేను స్వరం మాత్రమే విన్నాను, మీ ముఖాన్ని చూడలేదు మీ పేరు కూడా తెలియదు’ అని అన్నాడు.
అప్పుడు ఆ స్వరం ఇలా సమాధానం ఇచ్చింది ‘ నా పేరు జాన్, నేను క్రీస్తు యొక్క ప్రియమైన శిష్యుడిని.’
అప్పుడు పాపి సంతోష పడుతూ ఇలా అన్నాడు “ నేను ఇప్పుడు ఖచ్చితంగా లోపలికి అనుమతించబడతాను. పీటర్ మరియు డేవిడ్ నన్ను లోపలికి రానివ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మనిషి యొక్క బలహీనతలు దేవుడి యొక్క దయ తెలుసు. మీరు కూడా నన్ను అనుమతిస్తారు. ఎందుకంటే మీరు ప్రేమిస్తారు. దేవుడు అంటే ప్రేమ అని, ప్రేమించని వాడికి దేవుడి గురించి తెలియదు అనే కదా మీరు రాసింది. వృద్ధాప్యంలో కూడా ‘ సోదరులారా.. ఒకరినొకరు ప్రేమించుకోండి’ అని మీరు చెప్పారు కదా. అలాంటప్పుడు మీరు నన్ను ఎలా అసహ్యించుకొని పంపించేస్తారు. అలా చేయాలంటే మీరు చెప్పిన దాన్ని వదిలేయాలి లేదా నన్ను స్వర్గంలోకి అనుమతించాలి.”
వెంటనే స్వర్గపు ద్వారాలు తెచ్చుకున్నాయి. జాన్ తనతో పాటు ఆ పశ్చాత్తాప పడిన పాపిని స్వర్గం లోనికి తీసుకొని పోయాడు.
పశ్చాత్తాప పడిన పాపి “ Tolstoy అనువాద కథ బాగుంది.
జీవులను ప్రేమించడం,పశ్ఛాతాపం ఈ రెండు దైవ గుణాలని
తెలిపే సందేశాత్మక కథ .