నేను నా మధుపాత్ర ని పైకెత్తి
ఆకాశంలోని జాబిలిని
కిందకి రమ్మని ఆహ్వానిస్తాను.
జాబిలి నన్ను మన్నిస్తుందనుకుంటాను.
నేను నా మధుపాత్రను పైకెత్తి
పూలభారంతో వున్న కొమ్మలను
నాతో మధువు తాగమని అడుగుతాను.
వాటిని నేను కోయబోనని మాట ఇచ్చి
వాటికి దీర్ఘాయువు వుండాలని కోరుకుంటాను.
జాబిలి,పూవుల సావాసంలో నేను తాగుతాను.
మేమెవరం మంచిచెడుల గురించి విచారించడం లేదు.
మా ఉల్లాసాన్ని ఎంతమంది గ్రహిస్తారు..?
తాగడానికి నాకు మద్యంతో పాటు
సహచరులుగా చందమామ,పూవులు వున్నాక
ఇంకెవరో ఇంక నాకెందుకు..?