మా నేల మీదకి వసంతం వచ్చింది.
ఎప్పటిలాగే తురాయిపూలు వికసించాయి.
కానీ చూడటానికే నాకు కళ్ళు లేవు.
పూల పుప్పొడి పాడయి
పడి వుండడం చూస్తున్నాను.
చలికాలం ఇంత చల్లదనాన్ని
శవపేటికలలో వదిలివెళ్తుందని
నాకు తెలీనే తెలీదు.
ఈ చపలపు చావుల వాసన
ప్రతిచోటా వ్యాపిస్తోంది.
కొన్నిసార్లు కవిత్వం పచ్చి అబద్ధం కావొచ్చు.
యుద్ధం ముంచుకొచ్చినపుడు
అందాలనీ,సౌందర్యాలనీ ఎలా చూడాలో
అది అంత ఎక్కువగా చెప్పదు.
నడవలో నేను
రాలుతున్న ఆకుల్ని చూడను.
తూటా గుండ్లతో పాటు గెంతుతాను.
పొద్దుతిరుగుడు, కలువలు
సుడాన్ జాతీయ పుష్పం..
దేన్నీ పట్టించుకోను.
యుద్దం వచ్చినప్పుడు
పూలను ఎలా ప్రేమించాలో
కవిత్వం నాకు సరిగా నేర్పించలేదు.