మారాల్సింది ఇండస్ట్రీనా? రివ్యూయర్లా!?

Spread the love

సినిమా ఒక ప్రొడక్ట్ అనుకుంటే ప్రేక్షకుడు కస్టమర్. తను కొన్న ప్రోడక్ట్ ని రివ్యూ చేసే సహజ హక్కు కస్టమర్ కి ఉంటుంది.

ఇండస్ట్రీ బాగు పడాలి అంటే కేరళలాగా తక్కువ బడ్జెట్ సినిమాలు తీయాలి.

పెద్ద హీరోలూ అదే బడ్జెట్ లో రావాలి. నేచురల్ లొకేషన్స్ ని ఎక్కువ వాడి సెట్ ఖర్చులను తగ్గించుకోవాలి. హీరోల, హీరోయిన్ల కుక్కలకూ ప్రత్యేక వసతులూ ఇవ్వడం మానేయాలి. ఒక్కొక్కరికి 8, 10 మంది అసిస్టెంట్లు ఎందుకు అని వాళ్ళ సంఖ్యను తగ్గించాలి.రెమ్యునరేషన్లను తగ్గించి ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేసేలా పరిశ్రమనూ, నటులను ప్రోత్సహించాలి.

మలయాళంలో వచ్చిన మంజుమ్మలే బాయ్స్ ని మనదగ్గర భాష రాకపోయినా మలయాళంలో చూసే హిట్ చేశారు కదా. ప్రేమలూ అంతే కదా. తెలుగులోకి డబ్ చేస్తే కూడా బాగానే ఆడుతుంది. దానర్థం కొత్తదనాన్ని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

అప్పుడెప్పుడో బాలకృష్ణ చేసిన భైరవద్వీపం తర్వాత డీ గ్లామరైజ్ రోల్స్ చేసిన అగ్రహీరోలు ఎవరున్నారు? బ్రమయుగం లాంటి పాత్ర చిరంజీవితో చేయించగలరా!? చివరికి నవాజుద్దీన్ సిద్ధిక్ లాంటి గొప్ప నటుడ్ని తెచ్చి “బెన్ స్టోక్స్” చేసిన ఘనత మనది. మఖ్బుల్, మాచీస్ లాంటి నటనను తెలుగులో టబుతో తీసుకోగలిగారా!? కమల్, విక్రమ్ లు చేస్తున్న ప్రయోగాలు తెలుగులో ఎందుకు చేయరు?

Arunank Latha

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *