నేను నిరంతర ముట్టడిలో వున్నాను.
నా నాలుక నుండి గొంతు దాక
కాలిగోరు దాక
అన్నీ ఆక్రమించారు.
తుపాకీలు ఊపుతూ
నన్ను చంపేస్తున్నారు.
ఒక పెద్ద తెల్లనోరు రాకాసి
నా గొంతు నొక్కి
" జరిగింది చాలు.
ఇప్పుడు నా వంతు" అని అరుస్తుంది.
ఈ ఇరవై యేళ్ళుగా అతని వంతులో
లక్షన్నర సార్లు అనేక విధాలుగా
అతను నన్ను నా పేరు మీదే వధించాడు.
కాళ్ళూచేతులు తెగిన భర్తలు
చనిపోయిన పిల్లలు
చిధ్రమయిన అవయవాలు
కుంటుతూ వున్న బతుకులు
గర్భంలో పిండం అలాగే వుంది.
వేస్తున్న ప్రతి బాంబు శబ్దానికి
అనాథ పిల్లలు
మళ్ళీ మళ్ళీ అనాథలవుతున్నారు.