గులాబీ పూల బాట

Spread the love

గులాబీ పూల బాట పేరే కాన్సిక్వెన్సీ కి కొంచెం విరుద్ధంగా అనిపించింది. గులాబీ పువ్వు అంటేనే ముళ్లతో ఉంటుంది అంటే ఇది ముళ్ళదారి ఆ…?? ఏమో అంటూనే పుస్తకం అందుకున్న. బ్యాక్ బ్లర్బు చూస్తే కాస్త అవగాహనకొచ్చింది. సంపాదకులు గా కుప్పిలి పద్మ గారు,అనంత్ మరిగంటి గారు మంచి అంశం కోసం ప్రయత్నం చేశారు అనిపించింది

అయినా ఆలోచనలు వెంటాడుతుంటే అవును కదా ఎదుగుతున్న బాల్యం నుంచి టీనేజ్ వర్షన్ లోకి అడుగుపెట్టే సమయం ఎంత కృషియస్ గా ఉంటుందో అంత ఉత్సాహంగా ఉంటుంది. తల్లిదండ్రులకి టీనేజ్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే బతుకు సర్కస్లో తీగ మీద నడకే కాస్త అటు ఇటుగా బ్యాలెన్స్ తప్పిందో జీవితం గల్లంతే ఆలోచనలన్నీ ఒక్కసారిగా ఉంగ చుట్టుకున్నట్టు ఏం రాసి ఉంటారా అన్నకుతూహలంతో లోపలి పేజీలోకి అడుగు.

ఏ పుస్తకం చదివాలి అనుకున్నా ఓ డిక్షనొచ్చి కూర్చుంటుంది రచయితను గురించి ఆలోచిస్తూ వాళ్ళ రచనల ప్రవాహం గుర్తు తెచ్చుకుంటూ అలా నాకు బాగా నచ్చిన రచయిత్రి కుప్పిలి పద్మ గారు ఏ విషయం నైనా లోతైన భావాన్ని రాసే తనంటే ఒకింత ప్రేమ ఎక్కువే… తన కథతోనే మొదలుపెట్టా
పిల్లలకు మనం ఏదైనా నేర్పాలి అంటే ఆచరణలో మనము ఎంత నేర్చుకుని ఉన్నామో సరిచూసుకొని కొత్తగా మనల్ని మనం మలుచుకోవాలన్న ఆలోచనని గతాన్ని దులిపేయాలని బాగా చెప్పారు పద్మ గారు.

అలా ఒక్కో కదా చదువుతూ ఉంటే ప్రతి కథ ఓ ఆలోచనతో మొదలవుతుంది ఓ ప్రశ్నగా మిగలకుండా సమాధానమైన నిలబడుతుంది.అలా చదువుతున్న క్రమంలో వెంకటకృష్ణ అన్న రాసిన కథ చాలా చిన్న లాజిక్ బట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో ఆకాశానికి చక్రాలు కట్టి మనల్ని కట్టిపడేస్తుంది,ఈ పుస్తకంలో ఓ ఐదు అడుగుల బుల్లెట్ ఉంది నాకు బాగా నచ్చింది మనోజ్ఞగారి కథా పరమైన ఆలోచన కలర్ కాంప్లెక్స్ ఎంత వేధిస్తుందో చెప్పకుండానే చెప్పిన విధానం భలే ఉందిబాల్యం తీసుకొచ్చి పెట్టే పిరికితనం ఎంతగా మనుషుల్ని కలచివేస్తుందో., చిన్న చిన్న సంఘటనలు కూడా పిల్లల మనసుపై ఎంత ముద్రలు వేస్తాయో నస్రీన్ కథ చదివితే తెలిసిపోతుంది

ఎక్కడ ఆగిపోతుంది యుద్ధం అదో మానసిక సంఘర్షణ అలాంటి సంఘర్షణల సమాహారమే ఇలా ఒక్కో కథా ఒక్కో తీరుగా 9 కథల పుస్తకంగా అచ్చంగా బాగుంది టీన్ ఏజ్ పేరెంట్స్ ఒకసారి చదివి చూసుకోవచ్చు… పెద్దవాళ్లు చదివితే ఒక్కసారి గతాన్ని తడుముకోక మానరు. చదవండి ఒకసారి ఈ గులాబీ పూల తోట పరిమళమైతే మీ వెంట నడిచొస్తుంది


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *