కొన్ని కథలు పుస్తకాలు చదివినప్పుడు భావోద్వేగాల వెంట పరిగెడతాం..
ఈ మధ్య చదివిన పుస్తకాలలో ఇలా ఆగకుండా చదివేసిన పుస్తకం ఇదే అనుకుంటా…
మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా సూరీ పాత్ర భలే బాగుంది …
పెన్నా నది తీరాన ముళ్ళ కంచదారుల్లో
ఓ పసి పిల్లాడు నడుచుకుంటూ వెళ్లడం ఏంటి…?
కాలికి తగిలిన గాయాన్ని నదీమ ఒడిలో దాచుకోవడమా.!!
అని మన మెదడులకి ఆశ్చర్యాన్ని ఇచ్చి లోపలి పేజీలోకి లాక్కెళ్ళిపోతుంది..
అలా ఆశ్చర్యంతో మొదలైన కథ…
తాడిపత్రి రోడ్డుని, పడమట వీధిని, ఊరి పొలిమేరల్లో పాత సినిమాల్లో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే రావు గోపాల్ రావు లాంటి పాత్రల్ని చదవాల్సిందే అనిపించక మానదు
ఇక్కడ ప్రతి పాత్ర మనతోటి మాట్లాడుతూనే ఉంటుంది. మధు బాబు నవలల్లో సీక్రెట్ రూమ్లా కథ లాజిక్ బాగుంది.
నారేషన్ అంతా కూడా ఎక్కడా రచయిత దూరకపోవడం ఇంకా బాగుంది.
ఈ రోజుల్లో కూడా ఇంకా కులం పట్టిపీడించే బాల్యం ఉందా అంటే ఉందనే అనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో… రాజకీయం కానిది ఎక్కడుంది..
కథ మొత్తంలో శశి, సూరి వాళ్ల పాత్రల్లో వాళ్ళు ఒదిగిపోయారు.
వాళ్ళ మాటల్లో రచయిత చెప్పిన వాక్యం భలే నచ్చింది
“ఏం గ్రేటో, ఏమో.. ఇప్పుడు చూడు నువ్వు పది సంవత్సరాల తర్వాత వచ్చి, నా గురించి ఏమేం గుర్తున్నది చెప్తా వుంటే దాంట్లో అన్నీ నేను వేరే వాళ్ళని కొట్టినవే ఉండాయి ఎవరికైనా ఇట్లా గుర్తుండాలనుకోను కదా.!! కొంచెం దిగులుతో”….సూరీ
జరిగిన సంఘటనల్లో మంచి కంటే ఎక్కువ చెడుని గుర్తు పెట్టుకుంటారు అనే లాజిక్ని కథలో జోప్పించి ఒప్పించాడు రచయిత
“కారణాలు ఎవరికి తెలుస్తాయి చెప్పు మనం చేసిన పనులే కదా బయటికి తెలిసేది ” అన్న ప్రశ్నకు సమాధానంగా మనకు మనం చేసేది కరెక్ట్ అనిపిస్తే చాలు అది ఎంతటి ఉపద్రవాలనైనా దాటేస్తుంది అన్న నమ్మకాన్ని ఈ కథలో మనం చూడొచ్చు..
మనుషుల మధ్య ప్రేమలు, ఆప్యాయతలు ఎమోషనల్ గా ఎక్స్చేంజ్ అవ్వడం, అదే మనుషుల మధ్య అసహ్యాల్లోనుండి వచ్చే ఈసడింపు , బతుకు భయాల్లో నుండి పుట్టే ధైర్యం, స్నేహించడానికి వయస్సు తారతమ్యాలు అక్కరలేదనే… సందర్భాలు ఎదురవుతాయి.
ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించని చోట నలుగురి మాటల మధ్య జరిగిన సంఘటనల్లో మనుషులు ఎలా బంధించబడతారో చక్కగా వివరించిన మహమ్మద్ గౌస్ కి అభినందనలతో..
గౌస్ మీరు చెప్పినట్టు అటువంటి ప్రాంతాలు చూస్తే ఇప్పుడు నాకు ఏదైనా కొత్తగా కథ స్పురిస్తాదేమో అనిపిస్తుంది.
మీరంతా కూడా ఈ పుస్తకాన్ని చదివితే ఇష్టపడతారనిపిస్తుంది చదివి చూడండి.
రచయిత : మహమ్మద్ గౌస్ పుస్తకం కోసం: ఛాయా పబ్లికేషన్స్
For Copies