Spread the love తోకమల్లి చెట్ల నీడల్లోచెట్టాపట్టాల్ నడక.ప్రాణమంతా వేలాడేసిరహస్యాల్ని వినేపున్నాగపూలు.*గదిలో వెన్నెల చారికగది నానుకుని సన్నజాజి తీగఊపిర్లు సర్దుకునే ఘడియల్లోసుతారమైన రెక్కలతో ఎగిరివచ్చిమృదువుగా తాకే పూవు.*విచ్చుకున్న పారిజాతంఆకుమీదే రాలిపడి-రాతిరి నా నిశ్చింత నిద్రనీ మోచేతి దండ మీద.*పొగమంచు వాకిట్లోపల్చని పరిమళం.గుత్తులు గుత్తులుగాబంతీ చేమంతీ.పూలఋతువట లోకంలో.ఎంత హాయి, ఋతువు మారని ప్రేమకొలువైన హృదయంలో. Author ProfileRelated Postsమానస చామర్తిమానస చామర్తి#molongui-disabled-linkDecember 1, 2024మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ‘వాన కురిసినప్పుడు మా […]