మొదటి భాగం
కాలపు క్రాస్ రోడ్స్ లో
మరణశయ్యలు పరచుకున్న గాయాల్ని
ఎన్నిట్నని తప్పించుకుంటావ్
—-
ఆకాశం కొట్టే ఉరుముల దెబ్బకి అల్లాడి
కన్నీళ్ళని కురిసే మేఘాన్ని
ఎప్పుడైనా హత్తుకున్నావా
—-
తెగిపడిన రెక్కలా నువ్వున్నప్పుడు
గాయం చేసినవాళ్ళు
ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తారు
నీ కళ్ళ మీద వాలిన ఆకలి మాత్రం
నిన్నెక్కడో నిద్ర పుచ్చుతుంది
●
ఈ పంక్తులు ‘అవ్యక్తం’ కథ ముగింపులోవి
—
స్నేహితులు పరస్పరం అనుభవాలు పంచుకుంటూ ఉంటేనో, పరిశీలనలో, స్వీయ జీవితానుభావాల్లోనో, కొన్ని సంఘటనలు, ఘర్షణలు ఉంటాయి. ఇందులో కల్పనకు అవకాశం తక్కువ.
ఇటువంటి సందర్భాల్లో ఓ అలజడి ఉంటుంది.
ఆ అలజడి కొన్ని సందర్భాల్లో గాఢంగా, మరీ గాఢంగా మారి పీడనకు గురి చేస్తుంది.
ఆ పీడననుండి విముక్తి చెందేందుకు ఏదో ఒకటి చేయాలి.
—-
బాగా చదువుకోవడమేకాదు, ఎప్పటికీ నచ్చినవి చదువుకుంటూ ఉండాలనుకునే వారికి, వివిధ ప్రాంతాల్లో ఉంటూ వచ్చినవారికి, హోదా, బాధ్యత రెంటినీ గుర్తించి విధులు నిర్వహించేవారికి కొన్ని ఘటనలు సంభవిస్థాయి.,
—–
సాంత్వన కోసం అక్షరాన్ని ఆశ్రయిస్తారు.
అప్పుడు ఆ అక్షరం, కాగి, కాగి, మరిగి, మరిగి, పదాలై, వాక్యాలై ఓ కథగా పురుడు పోసుకుంటుంది.
అప్పుడు కొన్ని పదబంధాలు, కొన్ని కొత్త వాక్యాలు, మరు వాకిలి వెలసిన కథావనంలో వాహ్యాళికి వచ్చిన వారిని పలకరించి, వీడని గంధంలా చుట్టుకుని ఉంటాయి..
అటువంటి విచిత్ర స్థితికి పాఠకులు లోనవుతారు
వాళ్ళలో నేనొకణ్ణి
●
కన్నీళ్ళ ఖైదు – 34 పేజీ, అమృత భాండంలో నలుసు – 40, పీడ కలల తొక్కిసలాట – 43, కారును ఉరికించా – 44,
—
కొలతేసి, తయారు చేసినట్లుండే శరీరం, అక్కడక్కడా పొగుపడి తేడాగా కనిపిస్తోంది. 64
–
ఆమె సంభాషణలు, చిరునవ్వుతో మొదలై, అరనవ్వుతోనే ముగుస్తాయి.87
నా లోపల కురుస్తున్న వర్షాన్ని సముద్రం మాత్రమే
ఇంకించుకో గలదు.113
అప్పటికే వేగం పెరిగిన రక్తంలో ఎవరో రెండు లీటర్ల నీరు కలిపినట్లయింది.118
అతను తన దేహంతో, మనసుతో, అయినవాళ్ళతో, బయట సమాజంతో ఎన్నెన్ని యుద్ధాలు చేస్తున్నాడో…130
నలిగిన మల్లె చెండులా పది ఉంది శిశిర – 23
అమ్మ మంచం (బెడ్) మీద నలిగిన మల్లె చెండులా పడి ఉంది – అంతర్వాహిని 135
(అశక్తతను,వశం తప్పిన నిస్సహాయ క్షణాల్లో మనిషి పట్ల ప్రేమానురాగాలు వ్యక్తం చేసేందుకు ఆత్మీయంగా, లలితంగా, ఇంకోలా చెప్పే వీలు లేని పోలికలు)
ఈ పదబంధాల, వాక్యాల పూర్వా పరాలు తెలియాలంటే నూతక్కి ఉమ 2019 – 23 మధ్య రాసిన 120 పేజీల్లో నిక్షిప్తమైన 12 కథలు చదవాల్సిందే
●
కథ అనగానే, వస్తువు, శిల్పం, కథను నడిపించే తీరు, ఎన్నుకున్న భాష, నేపథ్యం అన్నీ గుర్తొస్తాయి. సగటు పాఠకుడికైనా సాటి కథారచయితకైనా ఎవరైనా వీటిని పట్టించుకోకుండా, పక్కన పడేసేవి కావు, కాబట్టి చదవాలి.
మరో ప్రధానాంశం, స్త్రీలు, పరస్పరం ఎంత ఆత్మీయంగా ఉన్నా ప్రస్తావించడానికి వెనకాడే ప్రాథమిక సత్యాలు కథల్లో సమాజ హితానికి, గ్రహించి, విలువనిచ్చి గౌరవించాలని..అవును అంటే అవును. కాదు అంటే కాదు బ్రహ్మ రుద్రాదులేకమైనా. చెప్పవలసింది చెప్పడానికి చదవాలి
●
కడుపు చిన్నది చేసుకుని కన్ను పెద్దది చేసుకున్న అత్తలూ, వేలె డంతటివాళ్ళను పొత్తిళ్ళల్లో ఉంచి, సాకి ప్రయోజకుల్ని చేసే అత్తలూ, అమ్మలూ ఉన్నారు..దహించే సమస్యలకు గొప్ప పరిష్కారాలు సూచించే పెద్దల గురించి తెలియాలంటే చదవాలి
—
ఇక్కడ అప్రస్తుతం,కానీ అవసరం.
వెనకటి రోజుల్లో నిరక్షరాశ్యులైన పెద్దలు, మహిళలు ఎలా ఊరడించేవారో చూడండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళలో ఎవరికైనా abortion అయితే అమ్మా ఖంగారు పడకు కుమ్మరి మంచివాడు. ఎన్ని కుండలైనా చేయొచ్చు అనేవారు.
లోకాజ్ఞానం ముందు తదితరం నిరుపయోగం
అని సారాంశం.
—-
రెండో భాగం
●
‘అంతర్వాహిని’ లో భావోద్వేగాలు నన్ను ఒకటికి రెండుమార్లు కొన్ని వాక్యాలు చదువుకునేలా చేశాయి. హార్ట్ ఎటాక్ వచ్చి ICU లో ఉన్న తల్లి అంటుంది – ‘ఎన్ని సంవత్సరాలయ్యిందే ప్రశాంతీ, నువ్విలా దగ్గరగా వచ్చి, ఏంటోనే, నా గుండె పగిలితే గానీ నీ మనసు కరగలేదే’
కథాంశం అమ్మ వద్దన్న వివాహం తను చేసుకుంది. అమ్మ అంచనా రైటు. తన అంచనా తప్పు. విడాకులు వచ్చేవరకూ కుటుంబం బాసటగా ఉంటుంది. గర్భంలో పెరుగుతున్న పిండం విషయంలో, అమ్మ గర్భం ధరించి బిడ్డను కనమంది. తను వద్దనుకున్నది, అమ్మ కావాలంది.
అన్నలూ చెల్లి దూరంగా. అమ్మ తమ వెంటే ఉన్నా, అమ్మకు చేరువగా తను ఉండలేకపోతుంది. దూరానికి కారణం తొలగని దోష భారం.
ఒక చలనచిత్రానికి సరిపడ కథ. పాఠకులు విధిగా చదవాల్సిన కథ
—–
మిట్ట మధ్యాహ్నపు నీడ, హుక్ – మొదటి కథ పీడకలగా మిగిలే బాల్యం లోది.
హుక్ అన్ని భాషల్లోకి తర్జుమా కావలసిన కథ.
ఇంటి దగ్గర స్వంత మనిషి కారణంగా జరుగుతున్న ప్రాణాంతక అసౌకర్యం.
వారించలేని ఆశక్తతను వీడి ఖచ్చితమైన వైఖరి తప్ప మరో మార్గంలేదన్న అత్తగారి బూస్టర్ డోస్.
‘భర్త అయినా, బాస్ అయినా పట్టి ఉంచేవి బంధాలు కావు. బండ గొలుసులు. శారీరక, మానసిక ఆరోగ్యానికి హానికరం’
—-
‘నీడ తొక్కిన ఆట’ – ఇద్దరు నేస్తాలు, లెక్కలేనన్ని గోడలు. ఒకరంటే ఒకరికి చచ్చే ఇష్టం. కులాల కాలుష్య అంటని ప్రేమ. గౌరి, మహి స్నేహితులు.
గౌరి కూతురు మహేశ్వరి. మహి కూతురు గౌరీ పూర్ణిమ కావడంతో కథ కక్ష్య దాటింది.
—-
25 వ గంట..షెడ్యూల్ ఖాయం. ఎక్కడా తీరికలేదు. తీరిక చేసుకోవాలి. షుగర్ అదుపులో ఉండాలంటే 45 నిమిషాలు నడవాలి. సర్దుబాటు తప్ప గత్యంతరం లేదు. మనం వీలు చేసుకునో, వీలు చూసుకునో అంటాం.
ముందు, వెనుకలు, చేర్పులు మార్పులు చేసుకునేది మనమే అయినా చెట్టు తొర్రలో తాయిలం దాచటం 25వ గంటలో చూస్తాం. లైఫ్ స్టైల్ అంశం.
—-
‘మరో వనమబ్బులకాలం’ – మంచి కథ
మనం కొన్ని చట్రాల మధ్య మరి కొన్ని చట్రాల బయట ఉంటూ ఉంటాం. ఈ కథలో వాళ్ళు మనకు తారసపడే ఎగువ మధ్యతరగతి వాళ్ళు.
మిథున, శరత్ – అర్జున్, మయూర (నెమ్మి)
మిథున శరత్ ఒక్కటయ్యారు. కానీ అర్జున్, మయూర అలా కాలేదు.
మయూర స్వేచ్ఛను, విడుదలను కోరుకుంటుంది
పెళ్ళి అనే బంధం సరిపడదు.
15 ఏళ్ళ తర్వాత ఒంటరిగా సముద్రపు ఒడ్డున ఉంటే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని, ఓ పెద్దాయన చెప్పిన కబురు మీద పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు.
మయూర తండ్రి మరణానంతరం, అర్జున్ తో మయూర పెళ్ళి అయింది. అతన్ని వదిలేసి వెళ్ళడమూ అయ్యింది.
మయూర వైవాహిక బంధంలో ఇమడదు అర్జున్ మయూర పై మక్కువను వీడడు.
‘ఆహానికి పోయి వాడు నెమ్మీ ని అంతకంత గాయ పరచాడు’. శరత్ తీర్మానం.
ఓ సంవత్సరం సాహచర్యం తర్వాత- ఏ చట్రంలో ఇమడలేని తన నిస్సహాయతను చెప్పేసింది.
మిథునను అర్జున్ మీద అక్కరతో మయూరను ద్వేషిస్తున్నావా అని శరత్ అడిగాడు.
ప్రశ్న కాదది చరుపు అనుకుంటుంది మిథున
ఒకరికి భద్రం అయ్యింది మరొకరికి బందిఖానా కావచ్చు . మేల్కొలుపు లాంటి చరుపు. స్వచ్చంగా, నిర్మలంగా దారి చూపే దారి దీపం.
——
‘నిర్జన’ – పని యావలో ఇరుగుపొరుగును పట్టించుకోకపోవడం – ఎవరూ, ఏ రకంగానూ క్షమించరు. ప్రాయశ్చిత్తం లేని శిక్షను అనుభవించాల్సిందే. సెక్యూరిటీ గార్డ్ కొడుకు యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఆ యింట్లో టీవీ దగ్గర క్రికెట్ చూసిన అబ్బాయ్, కూతురు జన్మదినానికి గ్రీటింగ్ ఇచ్చిన అన్నయ్య. రోజూ పేపర్ వేస్తూ కష్టపడే అబ్బాయ్, తల్లి లేని అబ్బాయ్, ఎంతో వినయంగా ఉండే వాచ్ మాన్ కొడుకు పోయాడు. ఆ అబ్బాయి కూతురుకు తెలుసు. భర్తకు తెలుసు. తాను గుర్తు తెచ్చుకోలేకపోతుంది. భర్తీ కాని శూన్యం.బరువైన శూన్యం. బాధ పెట్టె శూన్యం..నిర్జన అంతా ఆవరించి ఉంటుంది.
—-
‘చూపు’ – ముక్కోటి రోజు ఉపవాసానంతరం ప్రసాదాలు పంచడం కథాంశం
చూపున్నదెవరికి. లేని దెవరికి. చూపులేని వాళ్ళు ముందు చూపుతో వచ్చిన వాళ్ళే వస్తున్నారు. అదుపు చేసేందుకున్న పోలీసులు, పోలీస్ దొరలకు తీసికెళ్తున్నారు.
ఒకరు పూట గడవడంకోసం
మరొకరు అతిశయానికి
కథంతా సన్నాహ సంరంభం
—
‘Block the life’ – ఇదో తమాషా కథ. కథకు దిగువన ఉన్న రచయితతో ముఖ్యంగా కథ రాసింది స్త్రీలైతే ఫోన్ నంబర్ ఉన్న పాపానికి పాఠకులనుండి ఎదుర్కొనే ఇబ్బందులు, అందునా మగ వారి దృష్టి, వికారాలు. ఇదొక భాగం
ఆడపడుచు తన నెలల పిల్లడిని. ఆడిస్తూ అరే అత్తకు బెల్లం చూపించు అంటుంది.
పురుషుల వికారాలకు మూలాలు ఇక్కడున్నాయ్ అంటారు.
సిమోన్ సెకండ్ సెక్స్, నేచర్ ఆఫ్ సెకండ్ సెక్స్ . ఉమ గారు చదివి ఉంటారు
మగబిడ్డను కన్న తల్లికి అతిశయం ఎక్కువ
జెండర్ అసమానత ఉంటుంది.సంస్కారంతో వ్యవహరించాలి. పిల్లలకు బాల్యం నుండి చెప్పాలి. మనం బయటి వారిని అల్లరి పెడితే మనల్ని బయటివారు అల్లరి పెడతారు. ఓపిగ్గా, సహనంగా చెప్పాలే తప్ప మరో దారిలేదు. మూలాలు మారవు
For copies click the link
https://pusthakam.in/product/25va-ganta/
