మానవీయ విరామం

Spread the love

1..2..3..
చిధ్రమయిన నీ కొడుకు అవయవాలు
శుభ్రం చేసుకో.
చెదిరి తునకలైన నీ మొగుడి
తల భాగాలు తెచ్చుకో.
తొందరగా రా..
నీకు అరగంట సమయం వుంది.

3..2..1..
సమయం అయిపోయింది.
పరిగెట్టు..పరిగెట్టు..
బాధపడటానికి సమయం లేదు.
మేము బాంబులు వేసేస్తాం!
పరిగెట్టు..
మేం మీకు 
అరగంట విరామం ఇచ్చాం!
మేం మానవతావాదులం!!
Moumita Alam
P. Srinivas Goud

Spread the love

One thought on “మానవీయ విరామం

  1. Excelent translation.
    Tremendous feel carried poem.
    Congratulations both of you anna!!💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *