మలయాళం నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్లు మిగతా ఇండస్ట్రీ లతో పోలిస్తే చాలా పకడ్బందీగా, Believability కలిగి ఉంటాయి. దానికి కారణం ఎంతో కొంత సమాజంలో జరిగే వాటి నుంచి స్ఫూర్తి పొందడం. కురుప్ కానీ, kannur squad కానీ ఇంకా చాలానే ఉన్నాయి.
ఈమద్య వచ్చిన టోవినో థామస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ Anweshippin kandethum మంచి ఇన్వెస్టిగేషన్ డ్రామా. కాకపోతే ఈ కథ ఇంకో చోట నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనిపించింది. నిజ జీవిత సంఘటన నుంచి సినిమా కథ ఎలా మౌల్డ్ చేసుకోవచ్చు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కేరళలోని ఫేమస్ కేసు అయిన “సిస్టర్ అభయ కేసు” దీనికి ఆధారం. ఒరిజినల్ ఘటనలోని విషయాలు పెద్దగా మార్చినట్టు లేదు.
సిస్టర్ అభయ కేస్ కీ ఈ సినిమాలోని కథకీ పోలికలు చూద్దాం. అభయ కేసులో ఆమె ఆ మిషనరీ కాలేజీలో కొత్తగా చేరిన స్టూడెంట్. సినిమాలో చనిపోయిన అమ్మాయి కూడా స్టూడెంట్. తన హాల్ టికెట్ చర్చ్ ఫాదర్ కి చూపిద్దామని వస్తుంది. ఒరిజినల్ ఘటనలో ఆమె నన్ ట్రైనింగ్ లో ఉంది. సినిమా కథలో పాత్ర కూడా తాను నన్ కావాలని కోరుకుందని ఆమె తండ్రి పాత్ర చెబుతుంది.
ఒరిజినల్ కథలో ఫాదర్ ఒక నన్ తో బాగా సన్నిహితంగా ఉండగా చూడకూడని ఆ దృశ్యం చూసింది అభయ. సినిమాలో ఫాదర్ ను కాకుండా ఆయన సిస్టర్ కొడుకును పెట్టారు. అక్కడ విషయం అందరికీ చెబుతుందని అభయను చంపి బావిలో పడేస్తారు. ఇక్కడ ఆ అమ్మాయి అనుకోకుండా చపోయినట్టు చూపించారు. రెండిట్లోనూ ముక్కు, నోరు మూసి గాలి ఆడకుండా చంపేయడం కామన్. ఈ కేసులో అదే రోజు దొంగతనానికి వెళ్లిన ఒక దొంగ కీలక సాక్షిగా మారతాడు. సినిమాలో కూడా హీరో ఒక దొంగతనం సీన్ క్రియేట్ చేసి క్రైమ్ సీన్ లోకి వెళ్లి ఫోరెన్సిక్ క్లూస్ సంపాదిస్తాడు.
నిజానికి అసలు కథలో మర్డర్ తర్వాత ఉండే ట్విస్టులు మామూలుగా ఉండవు. truth is stranger than fiction కదా, కానీ సినిమాలో కిల్లర్ ట్రైన్ ఆక్సిడెంట్ కి గురైనట్లు పెట్టి కథను అక్కడికితో ముగించేశారు. బహుశా కొనసాగిస్తే అసలు కథ కనిపెట్టేస్తారు అని కాబోలు. ఒరిజినల్ కేసులో రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక ఇన్వెస్టిగేట్ చేసే ASI అగస్టిన్ సూసైడ్ చేసుకుంటాడు. సినిమాలో అయితే హీరోని సస్పెండ్ చేస్తారు.
ఆ కేసు నుంచి స్ఫూర్తి పొంది ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అందుకేనేమో ఆ కేసు తర్వాత ఈ సినిమాలో మరో కథ ఎత్తుకున్నారు. బహుశా దీనివల్లనే ఈ కథ ఒక ఆఫీసర్ జర్నీలా ఉంటుంది. అసలు కథలో ఏఎస్ఐ సూసైడ్ లాగానే ఇందులో క్లైమాక్స్ లో మాజీ పోలీస్ ఆఫీసర్ సూసైడ్ ఉంది. సినిమా చూడాలనుకున్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకేం చెప్పట్లేదు. మిగతాది సినిమా చూసి తెలుసుకోండి. టోవి ఎప్పట్లా బాగా చేశాడు.
మంచి చూడబుల్ సినిమా. నెట్ ఫిక్స్ లో ఉంది.