ఎవరినీ నిందించను కానీ ఆకాశంలో సగం అని పొకడకండర్రా నేలంతా మాదేనని మాటిచ్చేయకండి తవ్వుతున్న నేలలో మా కన్నీళ్ళ ఆనవాళ్లు కనపడతాయి చూడమని చెప్పను కానీ చూసీ మౌనంగా ఉన్న కొన్ని కళ్లకు నమస్కారాలు ఇదని ఇదంతా మాదేనని చెప్పిన వాళ్లకు చెబుతున్న మాదే కచ్చితంగా మాదే ఎప్పుడూ సమానత్వం కోసం పాకులాడలేదు కొత్తగా పోరాడింది లేదు ఆంక్షల సంకెళ్లు వేయొద్దనలేదు వేసినా ప్రేమతో వేయమని మనవి పువ్వుకు రంగు కొమ్మకు పువ్వు రంగుకు ఆకర్షణ ఎంత సహజమో మాపై ఆంక్షలు అంతే సహజం జాగ్రత్త అని చెప్పడంలో ఉన్న మెచ్యూరిటీ చేయొద్దని చేస్తే తప్పని చెప్పడంలో ఉండదేమో అమ్మ పిల్లలకు సద్దులు చెప్పినట్టే ఆడవాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయ్ అవి దాటాలని దాటేందుకు ప్రయత్నిస్తామని ఉద్దేశించకండి మీ ఊహల్లో మహరాణులమో కాదో కానీ మా నిజాల్లో ఇజాల్లో మేము మనుషులమే గీత దాటగానే దారితప్పినట్టు గీతోపదేశం చేయగానే నీతి కళ్లకు కట్టినట్టు కాదు పరిస్థితుల్ని అర్దం చేసుకొని ముందుకు నడవడమే అసలైన కృషి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
ఇంకెప్పుడైన అలా…
