‘డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది’ ‘and queit flows the don‘అనే పెద్ద నవలను రష్యన్ బాషలో 1925-32 కాలంలో మైకెల్ షోలోకోవ్ అనే రచయిత వ్రాసాడు. డాన్ నది ప్రాతం లో వుండే ‘కొసక్కులు’ అనే ప్రత్యేక సమూహానికి సభందించిన ప్రజల జీవన శైలిని, రష్యన్ విప్లవ విజయం తరువాత అంతర్ యుద్ధకాలంలో ఆ సమాజంలో జరిగిన ఒడిదుడుకులను ఈ నవల చక్కగా చిత్రీకరించింది. ఈ నవలకు సోవియట్ రష్యా అత్యుత్తమ బహుమతులైన, స్టాలిన్, లెనిన్ పురస్కారాలు దక్కాయి. 1965 నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది.
మొదటిసారి తెలుగు లోనికి నవల పూర్తి పాఠం దారావాహికంగా మీకు అందిస్తున్నాము. రచన శృంగవరపు ఎంతో శ్రమతో ఈ అనువాదాన్ని మనకు అందించారు. వారికి ఉదయిని ప్రత్యేక ధన్యవాదాలు చెబుతోంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ నవలను ఆస్వాదించండి.