విజయానికి అర్థం తెలియాలంటే12th ఫెయిల్ చూడాలి

Spread the love

ఈ సినిమా చివరిలో హీరో IPS interview లో ఒక మాట చెప్పుతాడు. మీరు interview లో పాస్ కాలేదు అంటే మీరు ఏమి చేస్తారు? అని interview చేసే వ్యక్తి హీరోని అడుగుతాడు. ” నేను సూర్యుడి లాగా వెలుగుని ఇవ్వకపోతే మా వీధిలో వీధి దీపమై వెలుగుని ఇస్తాను అని చెప్పుతాడు . విజయానికి ఇంత గొప్ప అర్థం చెప్పిన సినిమా 12 th ఫెయిల్ సినిమా . ఈ డైలాగ్ వినగానే నేను మగ్గం నేయడం అపి దాహం వెయ్యకపోయినా రెండు గ్లాసులు నీళ్ళు త్రాగి మళ్ళీ మగ్గం నేస్తు మూవీ చూశాను. చివరికి హీరో IAS పాస్ అవుతాడు. అది చూసి హీరో ఎంతో భావోద్వేగానికి లోనయ్యి కన్నీళ్లు కారుస్తాడు. నాకు ఆ సీన్ చూసి కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆ టైమ్ లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది లేకుంటే నా పరువు ఏమయ్యేదో!

హీరో పేరు మనోజ్ , మధ్యప్రదేశ్ లోని చెంబలో ఒక పల్లెటూరు . మనోజ్ అప్పుడే ఇంటర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ వుంటాడు ( అంటే ఎగ్జామ్స్ లో కాపీ కొట్టడానికి పేపర్స్ చింపుతూ ఉంటాడు ) హీరో ఫ్యామిలీకి ఒక తిక్క వుంటుంది. అదే నిజాయితీ . హీరో నాన్న ఒక govt ఉద్యోగి. నిజాయితీగా వుండటంతో ఆ హీరో తండ్రికి ఉద్యోగం పోతుంది. నేను సుప్రీం కోర్టు లో పోరాటం చేస్తాను అని చెప్పి. హీరో తండ్రి ఇంటి నుంచి వెళ్లి పోతాడు.

అప్పుడే మనోజ్ ఇంటర్ ఎగ్జామ్స్ పాస్ అయి తన ఫ్యామిలీ కి తోడుగా ఉండాలి అని అనుకుంటాడు. ఎగ్జామ్స్ హల్ లోకి మాస్టర్ వచ్చి ఒరేయ్ మీకు స్లిప్స్ పెట్టి రాసిన పాస్ అయే టాలెంట్ లేదు. నేనే బోర్డ్ పై రాస్తాను చూసి రాసుకోండి అని చెప్పుతాడు . అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ ఎగ్జామ్స్ ని ఆపుతాడు. అందరూ ఆ సంవత్సరం ఫెయిల్ అవుతారు . మనోజ్ మరియు మనోజ్ అన్న ఒక ఆటో నడపాలి అని అనుకుంటారు. అయితే అక్కడ వున్న ఎమ్మెల్యే వీళ్ళని పోలీస్ స్టేషన్ లో వెయిస్తాడు. మనోజ్ ఆ ఎగ్జామ్స్ అపిన పోలీస్ ఆఫీసర్ నీ కలిసి వాళ్ళ ప్రొబ్లెంస్ చెప్పుతాడు . ఆ ఆఫీసర్ వాళ్ళని విడిపిస్తడు. అప్పుడే మనోజ్ పోలీస్ అవాలి అని అనుకుంటాడు. నెక్స్ట్ ఇయర్ inter పస్ అయి , BA pass అయి. టౌన్ కి వెళ్లి అక్కడ స్టేట్ ఎగ్జామ్స్ జరగకపోతే. ఢిల్లీకి వెళ్లి, అక్కడ ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో అవమానాలు పడి. కుళ్ళు కుతంత్రాలకు లోనయ్యి చివరికి lPS అవుతాడు మనోజ్. మనోజ్ కష్టం ఎలాంటిది అంటే ఎడారి నేలలో విత్తనం మొలకెత్తడం లాంటిది . ఆ మొలక తిరిగి చెట్టు కావడం లాంటిది.

ఈ సినిమా చూసిన తర్వాత రెండు రోజులు మనల్ని వెంటాడుతుంది .

Vaddi Lokesh

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *