ఆఖరికి నిన్నరాత్రి ఈ సినిమా చూడటం కుదిరింది. రాత్రి కలత నిద్ర. ఈ ఉదయం కూడా సినిమా వెంటాడుతూనే వుంది.
ఎలుకలు, పాములు పట్టుకునే ట్రైబల్ కులాల వారి విషాదకర జీవితాలను, పై వర్ణాల ఆధిపత్యం, ముఖ్యంగా పోలీస్ జులుం, అమాయకుల ఆర్తరావాలతో సినిమా మారుమోగింది. సినిమా అట్టడుగు ప్రజల ఆహాకారాలను చక్కగా ప్రతిబింభించింది.
పోలీస్ జులుం వికృతి ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసింది. వారి మీద జరిగే దారుణ హింసను రియలిష్టిక్ గా చూపించారు. 21వ శతాబ్దం లోకూడా ఇంతటి వివక్షా! అని బాధ కలుగుతుంది.
ఉద్యమాలను పాజిటివ్ గా చూపించడం విశేషం. మర్క్స్, లెనిన్, అంబే్త్కర్, పీరియార్ ల చిత్రాలను చూడటం ఆనందం కలగచేసింది.
నిర్మాతలు సూర్య, జ్యోతిక లకు అభినందనలు. దర్శకత్వం అదుర్స్!
ఇటీవల వస్తున్న తమిళ, మలయాళ మరాఠీ సినిమాలలో అభ్యుదయ విప్లవభావాలు వున్న సినిమాలు వెల్లివిరుస్తున్నాయి. వాటిని చూడగలుగుతున్నామంటే అంతా ott మహిమే.. తెలుగు సినిమా, సాహిత్యాలు ఫ్యూడల్ అణచివేత బంధాలనుంచి బయటపడాలని, ప్రజల బాధలను, పోరాటాలను ప్రతిబింబించే మంచి సినిమాలు, సాహిత్యం రావాలని కోరుకొంటూ..
ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది.
అర్జెంట్ గా చూసేయండి..