పెరుమాళ్ మురుగాన్ (రచయిత) సమాజాన్ని చూసిన ఓ విభిన్నమైన కోణం ఈ పూన్నాచ్చి.
ప్రభుత్వం ఎప్పుడు తన ప్రజల మాటలు వింటుందో ఎప్పడు వినిపించుకోదో చెప్పడానికి నవలలో ఒక పాత్ర ఎలా అంటుంది,
“ మెల్లగా మాట్లాడమ్మ అన్ని పక్కల ప్రభుత్వానికి చెవులున్నాయి, ప్రభుత్వానికి చెవులు పనిచెయ్యవు అన్నది పాత సామెత ఉంది కదా, మన సమస్యల గురించి మాట్లాడితే చెవుడు దాని గురించి మాట్లాడితే పదును”
ఈ వ్యాక్యం చదివినప్పుడు మీకు మన పాలకులు గుర్తరాక మానరు ఈ రోజు ప్రజలు, విధ్యార్థులు, కార్మికులు రోడెక్కి తమ సమస్యలు గురుంచి నెలలు తరబడి పోరాడుతుంటే మన ప్రభుత్వం నాకు ఎం వినపడదని చెవిట పాత్ర పోషిస్తుంది, అదే ప్రజలు ప్రభుత్వం పైన గాని చిన్న మాట మాట్లాడినా, ఒక పాటో కవితో రాసిన లేదా ఒక బొమ్మ గీసినా వెంటనే ప్రభుత్వానికి చెవులు పదునేక్కుతాయి, ఒక్కోసారి ఒళ్ళు కూడా బలిసి ప్రజలపై యుదానికి దిగుతుంది, ఇది ఇవాళ నిత్యం జరుగుతున్న తంతు.
ఇలా చెప్పుకుంటూ పొతే చాల చోట్ల ఈ పుస్తకంలో మనకి మనమే కనిపిస్తాం, మన చుట్టూ ఉన్న సమాజం కనబడుతుంది, సమాజంలో రకరకాల మనుషుల విపరీత ధోరణి కనబడుతుంది. అవసరాన్ని, ఆశని దాటినా మనుషుల స్వార్ధం చేసే తప్పులకు బలైపోయిన జీవితాలు జీవితాలు కనబడతాయి. అసలే బరువైన బంధుత్వాలు భారంగా మారడం కనబడుతుంది. మొత్తంగా ఈ సమకాలీన సమాజంలో మనం మనతో మాత్రమే చెప్పుకొనే నిజాలు కనబడతాయి.
పూన్నాచ్చితో నా ప్రయాణం అని నవల ముగిసాక ఈ పుస్తకాన్ని తమిళం నుండి తెలుగులోకి అనువాదం చేసిన గౌరీ కృపానందన్ గారు ఒక నాలుగు పేజీలు ఈ పుస్తకం గురుంచి,పుస్తకంతో తన ప్రయాణం గురించి రాసారు, అది చదివిన తరవాత నాకు పుస్తకం గురించి నేను కొత్తగా చెప్పడానికి ఎం మిగలలేదు అనిపించింది. అయినా నాకు నచ్చిన ఒక్క చిన్న సంభాషణ నేటి సమాజంతో పోల్చి చెప్పే ప్రయత్నం చేశా.
![](https://udayini.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2022-11-20-at-7.41.49-PM-150x150.jpg)